Prema Kavithalu in Telugu
- నేను మారని గతంలో, మరణిస్తున్న ప్రస్తుతాన్ని
నువ్వులేని ప్రతిరోజూబాధల్లో ఉన్నభారంగా ఉన్నకష్టాల్లో ఉన్నకన్నీళ్ళతో ఉన్నవీటన్నిటిని తెచ్చే ఒంటరిలో ఉన్నా
- “నేడు రేపటికి ‘నిన్న’ అవుతుంది. నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే, నేడు కూడా బావుండాలి”…
ఒక అమ్మాయి.,
- ఓడిపోయేవారు ఒక్కసారే ఓడిపోతారు.గెలిచేవారు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతారు.వందసార్లు ప్రయత్నిస్తారు కాబట్టి”…
Telugu Love Quotes Text
హరుడి గొంతులో హలాహలం
బొట్టు జారినా జగతి నాశనం
మరుభూమి యదలో శాద్వలం
ప్రతి నీటి బొట్టుతో సాగు జీవితం
బొట్టుబొట్టునూ ఒడిసిపట్టకపోతే
హరుడైనా నరుడైనా
కాక తప్పదు బ్రతుకు దుర్బలం
Love Quotes In Telugu
———————————————————————–
విరించి రాయాలా నీ గురించి రాతలుజ్వలించి రాలేవా విరజిమ్ముతు కాంతులుజనించి దుందుభివై ప్రతిధ్వనించు దిగంతాలువీక్షించి ఊరుకునుంటే జరిగేవా యే కథలువారించి వదిలేస్తుంటే కడతేరవు నీ వెతలువధించి రా నీ నిశ్తేజపు పార్శ్వాన్నితెగించి రా వ్రాసేందుకు నవకావ్యాన్ని
ఏళ్ళ తరబడి ఎన్నో తట్టుకుని నిలబడ్డ ఒక మఱ్ఱిచెట్టును,
ఓరోజు ఉదయం దారుణంగా నరికి చంపేశారు.
తన భుజాలపై పుట్టి పెరిగిన పక్షులు
ఏడ్చుకుంటూ ఎగిరెళ్ళిపోయాయి
తన ఊడలపై ఆడిన ఉడుతలు
తల్లడిల్లిపోయాయి
వందేళ్ళ జీవితం ఓ గొడ్డలిపెట్టుకు నేలకొరుగుతుంటే
నోరైనా మెదపక
ఎదురైనా చెప్పక
మౌనంగా రోదిస్తూ కుప్పకూలిపోయింది.
నన్ను నేను విరచించుకోవాలనుంది
నే మునుపెన్నడు పలుకని భావాల్తో
ముందెన్నడు వాడని పదాల్లో
యే ప్రేరణలేని ధోరణిలో
అంతుచిక్కని వ్యాకరణంతో
మలుపులతో
మధురానుభూతులతో
ఉపిరి నిలిపే ఉత్కంఠతతో
శోక కావ్యమో… హాస్య గ్రంథమో
ప్రేమ గానమో… విప్లవ గేయమో
నిగూడార్ధాల నిఘంటువో
అర్ధంలేని స్వచరితమో
ఏమవుతానో…
ఎలా ముగుస్తానో…
నిముషంలో నిశీధి చేరే యుగాల ఘనత,
అణువణువు ముద్దగ తడిసిన నెత్తుటి చరిత,
పసికందుల ఊపిరి తీసే సమాజ భవిత,
రాక్షసులై రాస్తున్నారీ విద్వేషపు కవిత.
మూగవోయింది మానవతా రాగం
మనిషిని మింగింది మత విద్వేషపు రోగం
రక్తమోడుతూ మరణిస్తోంది,
తగలబడుతున్న నవ యుగం.
కటిక చీకటి పండువెన్నెలతో రమిస్తోంది.కొలను ఒడ్డున కూర్చుని చూస్తున్నాన్నేను.
కలువ పువ్వొకటి దొంగచాటుగా విచ్చుకుంటోంది.
అలికిడి లేకుండా ఈదులాడుతోంది రాజహంసల గుంపు.
గాలికి అలలుగా కదిలిన కొలను నీరు తళ తళా మెరుస్తోంది.
కుతూహలంగా చేప పిల్లలు పైకివచ్చి చూస్తున్నాయి.
ఒడ్డున వున్న రావి చెట్టుపై గువ్వల జంట గుసగుసలాడుతోంది.
తెల్లని కుందేళ్ళు పచ్చగడ్డిలో ఆడుకుంటున్నాయి.
కొలను ఒడ్డున కూర్చుని చూస్తున్నాన్నేను.
ఈ అందమైన రాత్రిలో నిన్ను కలుసుకోవాలని
ఎదురుచూస్తున్నాన్నేను.
తీరాన్ని తాకి వెనక్కి వెళ్ళిన కడలి కెరటాలు,
పడమర దిక్కున వాలిపోయిన సూర్యుడు,
మబ్బుల చాటుకి వెళ్ళిన చందమామ,
తిరిగి వస్తుంటే ఎంత అందంగా వుంటుందో కదా…!
నువ్వుకూడా అలా రావా…!!!.
అసూయలో మరిగి,
అహంతో రగిలి,
విద్వేషం దేహంగా,
హింసే మస్తిష్కంగా,
క్రోధాన్నే ఆయువు చేసి,
స్వార్ధాన్నే పోత పోసి,
కామంతో మెరుగులద్ది,
నిలువెత్తు నీచంలా నన్ను నేను మలుచుకున్నాను…
ప్రతీ నువ్వులో వున్నది ఈ నేనే…
రాధ యద సవ్వడి జోల లేక
యదురాజుకు నిదుర కరువు.
రాబందుల మూతులనిండా, రాచిలుకల నెత్తుటి మరకలు. రాలిన రంగుల రెక్కలకోసం,తిరుగుతున్నదొక కాకుల గుంపు.
నన్నిక్కడ వదిలేసి,
నగ్నంగా వెళ్ళిపోతున్నాను
సుదూరాల తీరంలో,
ఎదురుచూస్తున్న నాకోసం.
అస్థిత్వం లేని స్వగతాలు,
అరువుతెచ్చుకున్న ఆలోచనలు,
మసకబారిన మనస్తత్వాలు,
జీవంలేని దేహాలు.
ఇదే నేను. ఇదే నువ్వు.
ఆశల చుక్కాని దారిచూపెడుతుంటే,జ్ఞాపకాల అలలపై నా నావ కదులుతోంది.ఏ తీరం చేరునో…! ఏనాటికి చేరునో…!
గొంతునరాలు పగిలేంత మౌనంగా అరుస్తున్నారు,ఎవరో!వినపడనట్టుగా పరిగెత్తాను నేను.నాలోని మూర్ఖుడు,ఆ మౌనాన్ని వింటూ నిస్సహాయంగా నిల్చుండిపోయాడు
నా చిగురాశల గీతం
నడిరేయిన సైకతం…
విరబూసిన వసంతం
సుదూరాల ఏకాంతం…
ఏకాంత అనంతం,
అంతులేని స్వగతం…
పొద్దుగూకుతున్నట్టు నిద్రపోతుంటాది…
జాము గడిసినట్టు మెసులుతుంటాదీ…
కల్లు తెరచేసరికి నే కల్లముందుంటే…
పొద్దుపొడిచినట్టు సిగ్గు పడతాది…
తానొంకనే చూస్తూ నే మురిసిపోతుంటే,
చాలింక పొమ్మనీ మారాము చేస్తుంది…
కల్లోకి నేనొచ్చి ఏటేటో చేశానని,
మెల్లంగ ననుగిచ్చి గారాలు చేస్తుంది…
ఇద్దరొకటైపోయి ముద్దులాడేయేళ,
చెమ్మగిల్లిన కల్లతోనాలోకి చూస్తుంది…
- Telugu Birthday SMS Wishes
- Motivational Quotes English
- Quotes in Telugu
- Telugu SMS Jokes